![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -870 లో.. సౌజన్య రావుకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే కాలేజీ తన సొంతం చేసుకుంటాడని ఫణీంద్ర, మహేంద్ర టెన్షన్ పడుతుంటారు. నువ్వు ఇప్పుడు రిషి దగ్గర నుండి వచ్చావ్ కదా రిషికి ఫోన్ చేసి ఇక్కడ సిచువేషన్ చెప్పు, రిషి వస్తాడని ఫణీంద్ర అనగానే.. రిషి ఇక్కడకి రాడని మహేంద్ర చెప్తాడు.
మరొక వైపు కాలేజీ లో ఉన్న సిచువేషన్ చెప్పడానికి రిషికి వసుధార ఫోన్ చేస్తుంది. నన్ను డిస్టబ్ చేయకని రిషి అంటాడు. అయిన వసుధార మళ్ళీ మెసేజ్ చేస్తుంది. మీరు రండి అని వసుధార మెసెజ్ చేసిన రిషి పట్టించుకోడు. మరొక వైపు దేవయాని, శైలేంద్ర, సౌజన్య రావు తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని సంతోషపడుతుంటారు. వాళ్లకి ఎక్కడ హోప్ లేదు. ఇక కాలేజీ మన సొంతం కాబోతుందని దేవయాని అంటుంది. ఇప్పటివరకు బాగా నటించావ్. ఇక ముందు ఇంకా బాగా నటించాలని సౌజన్య రావుకి శైలేంద్ర చెప్తాడు. మరొక వైపు జగతి అన్ని వైపుల ప్రాబ్లమ్ నుండి బయటపడడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత జగతి బాధపడుతుంటే మహేంద్ర వచ్చి ఓదారుస్తాడు. రిషి వస్తాడంటవా అని జగతి అడుగగా.. రానని చెప్పాడు కదా అని మహేంద్ర అంటాడు. రిషి వస్తాడని జగతి అంటుంది. మరొక వైపు రిషికి వసుధార వరుసగా ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నావ్? నీకు సాధ్యం అయినంత సాయం నువ్వు చేయు గాని నన్ను డిస్టబ్ చేయకని రిషి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు.
మరొక వైపు అందరూ మీటింగ్ దగ్గర కూర్చొని ఉంటారు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ అందరు సంతకం చెయ్యండని సౌజన్య రావు అనగానే.. మీకు ముందే చెప్పాను ఈ కాలేజీ ని మీరు హ్యాండిల్ చెయ్యలేరు. ఎండి పోస్ట్ నీ వదిలేయండని, అలా వదిలేసుంటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని శైలేంద్ర అంటాడు. మీరు సంతకం పెట్టండని జగతికి సౌజన్య రావు చెప్తాడు. జగతి బాధగా సంతకం పెట్టబోతుంటే మురుగన్, పాండియన్ వస్తారు. మురుగన్ డబ్బు తీసుకొని వచ్చి సౌజన్య రావు ముందు పెడతాడు. ఈ డబ్బు తీసుకొని అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చేయ్ అని మురుగన్ అంటాడు. అసలు నిన్ను ఎవరు పంపించారని శైలేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |